Skip to main content

Telugu News Power

ముఖ్యమంత్రి, మంత్రికి కర్ణాటక ఆహ్వానం.

అమరావతి: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర జలవనులను శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తో కర్ణాటక ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో భేటీ అయింది. తుంగభద్ర ఆనకట్ట నూతన గేట్లు ఈనెల 25న ప్రారంభిస్తున్న సందర్భంగా వారు ఆహ్వానం అందజేశారు. కర్ణాటక చిన్న తరహా నీటిపారుదల శాఖ మాజీ మంత్రి ఎన్ ఎస్ బోసు రాజు, ఎమ్మెల్యే బసవరాజు రాయ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవన్న గౌడ బదర్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును వారు ఈ సందర్భంగా సత్కరించారు. వారితో మంత్రి తన పేషీ లో ఇష్టగోష్టిగా మాట్లాడారు.