నర్సాపురం: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. కొత్తపల్లి సోమవారం నరసాపురం వారి స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల సంతోషం చూసి ఓర్వలేని వైసీపీ పార్టీ సమస్యలు సృష్టించటానికి అవాకులు చవాకులు మాట్లాడటం మంచిది కాదని హేతువు పలికారు. అంబేద్కర్ కాల్షియం జిల్లాకు చెందిన వైసీపీ నాయకుల ఆరోపణలను కొత్తపల్లి ఖండించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందున వైసీపీ వారు నిరాశ నిస్పృహలకు లోనై అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలలో కాపులకు సరైన ప్రాతినిధ్యం కానీ, గుర్తింపు కానీ లేదని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్ రద్దు చేసినప్పుడు వైసీపీ కాపు నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు గుగ్గిలపు మురళి, వన్నెం రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుఖశాంతులు. ఓర్వలేని వైసిపి పార్టీ -కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న కొత్తపల్లి