పాలకొల్లు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)కోనసీమ జిల్లా రావులపాలెం కు చెందిన ఇద్దరు పేద అనారోగ్య బాధితుల గురించి పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా వాకర్స్ క్లబ్, పాలకొల్లు చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకుని మందులు కొనుగోలు చేయలేని తమ పరిస్థితిని తెలుపగా స్పందించిన అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు క్లబ్ తరపున కిడ్నీ, లివర్ వ్యాధితో బాధపడుతున్న భోగిశెట్టి నాగేశ్వర రావు కు రూ.25 వేల విలువైన మందులు, టైప్ -1 డయాబెటిస్ తో బాధపడుతున్న 8 వ తరగతి విద్యార్థి చోడిశెట్టి హేమంత్ వినయ్ కు 10 వేల రూపాయల విలువైన ఇంజెక్షన్ల ను బుధవారం కొత్త కుళాయి చెరువు వద్ద సభ్యులతో కలిసి అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షులు మానెం బసవరాజు, ధనాని శ్రీరామమూర్తి, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు,సభ్యులు జవ్వాజి కల్యాణ్, బాసినసత్యనారాయణ,
సోమంచి శ్రీనివాస శాస్త్రి, ధనాని సూర్యప్రకాష్, సామాజిక కార్యకర్త బోనం రాజు తదితరులు పాల్గొన్నారు.
పేద రోగులకు వాకర్స్ క్లబ్, మందుల వితరణ.
రోగులకు రోటరీ క్లబ్ సభ్యుల ఉచిత మందుల పంపిణీ