Skip to main content

Telugu News Power

ముద్రగడ కుమార్తె క్రాంతిపై మండిపడ్డ పద్మనాభరెడ్డి.

పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ముద్రగడ

హైదరాబాద్:జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి తన కుమార్తె భార్లపూడి క్రాంతిపై మండిపడ్డారు. గతంలో తన సతీమణి క్యాన్సర్ చికిత్స అనంతరం విశ్రాంతి కోసం హైదరాబాద్‌లోని కుమార్తె నివాసానికి వెళ్లిన సందర్భంలో అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నామని ఆయన ఆరోపించారు. కుటుంబ విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ముందుకు తీసుకురావడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు . ప్రస్తుతం తమ కుటుంబాన్ని అన్ని విధాలా అండగా నిలుస్తున్న గిరిబాబుపై అనవసర ఆరోపణలు చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేని విషయాల్లో రాజకీయ కోణం తీసుకురావద్దని, వ్యక్తిగత అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ముడిపెట్టడం తగదని ముద్రగడ పద్మనాభరెడ్డి వ్యాఖ్యానించారు.