Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణమయ నిధి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం. విరివిగా భక్తుల విరాళాలు.

స్వర్ణమయ నిధి విరాళాల ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం: జూన్, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయ ప్రాజెక్ట్ ప్రత్యేక కౌంటర్ గురువారం ప్రారంభించారు. భక్తుల నుండి బంగారం విరాళం గా సేకరించే కార్యక్రమం నిమిత్తం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను స్థానిక శాసన సభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, సత్యవాణి దంపతులు ప్రారంభించి, తొలిగా వారి సమీప కుటుంబ సభ్యులు హైదరాబాద్ కి చెందిన
బి. నరసింహారావు పేరు మీద లక్ష యాభై రూపాయలు నగదు విరాళంగా అందచేసారు.కౌంటర్ ప్రారంభించడానికి ముందు కమిటీ సభ్యులు, ధర్మకర్తలు శ్రీ అమ్మవారి కి ప్రత్యేక విశేష పూజలు జరిపారు. అనంతరం భీమవరం చెందిన కి కట్టా వెంకటేశ్వరరావు సుమారు
రూ.56 వేలు విలువ కల 4 గ్రాముల బంగారం, భీమవరం కి చెందిన టి వెంకట కృష్ణ గుప్తా, రామకృష్ణమూర్తి దంపతులు 11,116రూపాయలు, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ రూ. 1500 లు విరాళంగా అందచేసారు. ఈ కార్యక్రమం లో రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, మాజీ రాజ్య సభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణo శ్రీనివాస్, ఉదీశి మీనాక్షి అతికెల ఆంజనేయ ప్రసాద్ ,గుసిడి నాగ శిరీష,కారెంపూడి ఆదిలక్ష్మి,అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గుణేశ్వరరావు,మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతిన రమణ,యండ సత్యవతి,ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పాపొలు ఏడుకొండలు మరియు సంపూర్ణ స్వర్ణమయం కమిటీ సభ్యులు రమేష్ కుమార్ అగర్వాల్ , గొంట్లా వెంకట నారాయణ,పొత్తూరి బాపిరాజు, బొండాడ రామమోహనరావు,కాగిత వెంకట రమణరావు, బొండాడ నాగభూషణం, సంగడి వీర వెంకట శివ సత్యనారాయణ పాల్గొన్నారు అని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు