Skip to main content

Telugu News Power

శ్రీ క్షీరా రామంలో లక్ష్మీ గణపతి హోమం.

లక్ష్మీ గణపతి హోమం పూజలు జరుపుతున్న భక్తులు

పాలకొల్లు: ఆగస్టు, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన మండపంలో, సోమవారం సంకటహర చతుర్థి సందర్భంగా, ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ పూజలో 14 మంది పుణ్య దంపతులు దంపతులతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అభిషేకం పండిట్ భమిడిపాటి వెంకన్న,శ్రీ స్వామివారి పూజలు,
హోమం పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్ ఆలయ సూపరింటెండెంట్ వాసు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వైద్యులు.

డాక్టర్ విద్యాతోభి, డాక్టర్ నర్సవాణి, డాక్టర్ సుజయశ్రీ ,సోమవారం శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు.వీరిని ఆలయ కార్యనిర్వహణాధికారి వారు వారిని శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేసినారు.
,