Skip to main content

Telugu News Power

ఏడు వారాల వాడపల్లి వెంకన్న ఆలయంలో భక్తులకు విశాల అన్నదాన భవనం. -కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చే ప్రారంభం.

వకుళామాత భవనము వద్ద ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు.
వకుళామాత అన్నదాన భవనాన్ని ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి వర్మ

ఆత్రేయపురం: ఆగస్టు,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏడువారాల వెంకటేశ్వరునిగా, దిన దిన ప్రవర్తమానమై 15 దేశాలకు పైగా విస్తరించిన, స్వామివారి భక్తుల కొంగు బంగారం,
కోనసీమలోని ప్రసిద్ధ వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో భక్తుల రద్దీ నానాటికి విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి, భక్తుల సౌకర్యార్థం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో రోడ్లు పార్కింగ్ సౌకర్యం మెరుగుపరిచారు. ఈ సందర్భంగా, భక్తులకు మహా ప్రసాదం అందించటానికి విశాలమైన భవనం, రూ.8 కోట్లతో నిర్మించారు. ఈ భవనానికి “వకుళ మాత అన్నప్రసాద భవనం” గా నామకరణం చేశారు. ఈ భవనంలో ఒకేసారి 2,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించే అవకాశం ఉంది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆదివారం ఈ అన్న ప్రాసాదాన్ని ప్రారంభించారు ఈ ఏర్పాట్ల పట్ల కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు.
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడంలో ఈ భవనం కీలక సేవలు అందించాలని ఆకాంక్షించారు.వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. కేంద్రమంత్రి తో తనకున్న చదువుతో మహా ప్రసాద ఏర్పాట్లకు నిధులు తీసుకురావటానికి హామీ ఇచ్చారు. ఉత్తరాది వారు కూడా వాడపల్లికి తరలిరావడం ఆ స్వామివారి పట్ల వారికున్న రచించడం అయిన నమ్మకమని పేర్కొన్నారు. అంతా దానధర్మాలు చేయడానికి ఆ భగవంతుడే మనకు అవకాశం కల్పించాలని భక్తులు భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందరావు తో పాటు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు( గబ్బర్ సింగ్), ఆలయ ఉప కమిషనర్ నల్ల సూర్య చక్రధర్ రావు తదితరులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

భవనం లోపల భక్తులకు భోజన ఏర్పాట్లకు అమర్చిన టేబుళ్లు