Skip to main content

Telugu News Power

భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి శ్రీకారం.

అభివృద్ధి పనులు ప్రారంభానికి పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కలెక్టర్
భద్రాచల రామాలయం వద్ద పనులు ప్రారంభం

భద్రాచలం: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రఖ్యాత, చారిత్రక ఆధారాలు గల కంచర్ల గోపన్న నిర్మించిన భద్రాచలం
శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు రూ.351 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టనున్న ఈ పనులను ఆగమ శాస్త్రానుసారం, సంప్రదాయ శిల్పకళ ఉట్టిపడేలా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది రానున్న గోదావరి పుష్కరాలకు విశేషంగా భక్తులు ఆలయానికి తరలి వస్తారు. వారికి సౌకర్యాలు వసతి కల్పించడానికి ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.