Telugu News Power

తిరుపతిలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా వీబీ-జీ రామ్-జీ కార్యక్రమం ప్రారంభం.

ఉపాధి హామీ ప్రారంభోత్సవ ఫలకాన్ని ఆవిష్కరించిన దృశ్యం
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్

తిరుపతి:జూలై 2: (తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి, జీవనోపాధి అవకాశాలను మరింత బలోపేతం చేయడానికి తీసుకొచ్చిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ఒబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పి. చంద్రశేఖర్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.ఈ కొత్త పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, శాశ్వత ఆస్తుల సృష్టి, సాంకేతికత ఆధారిత పారదర్శకత, జీవనోపాధి అవకాశాల విస్తరణపై దృష్టి సారిస్తుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఈ పథకం గ్రామీణ శ్రామికులకు రోజువారీ వేతనాలను పెంచింది. జూలై 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వచ్చాయి.
కొత్త నిబంధనల ప్రకారం,దేశంలో ఎక్కడా రోజువారీ కూలి రూ.300 కంటే తక్కువ ఉండదు.
జాతీయ సగటు రోజువారీ వేతనం రూ.298.80 నుంచి
రూ. 327.40కు పెరిగింది.
సగటున 10 శాతానికి పైగా వేతనాల పెంపు జరిగింది.
గ్రామీణ కుటుంబాలకు 100 రోజుల బదులు 125 రోజుల ఉపాధి హామీ కల్పించనున్నారు.
తక్కువ వేతనాలు ఉన్న రాష్ట్రాలకు 15 శాతం నుంచి 25 శాతం వరకు అధిక పెంపు లభించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ పథకం అమలులోకి రాగా, రాష్ట్రానికి నోటిఫై చేసిన రోజువారీ వేతనం రూ.300 నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్రాల వారీగా ప్రకటించిన రేట్ల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో వేతనాల్లో మార్పులు ఉండవచ్చు.