Telugu News Power

వి బి- రాంజీ పథకం ప్రారంభం రోజు, మంత్రి శ్రామికులతో ఆత్మీయ కలయిక.

లక్కీ డిప్ ఫలితాలు ప్రకటిస్తున్న మంత్రి నిమ్మల
మహిళల టగ్ ఆఫ్ వార్ ఆట తిలకిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: జులై,2( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రమను గౌరవించి, కష్టాన్ని గుర్తించి శ్రామికులను సత్కరించాలనే సంకల్పంతో, వారికి ఆటవిడుపుగా ఆత్మీయ కలిగి ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక తెల్ల పూడి గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన ఉపాధి హామీ శ్రమికుల భారీ ఆత్మీయ కలయికలో మంత్రి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు జరుగుతున్న సందర్భంలో తాను పరిశీలించినప్పుడు వారు మండుటెండలో పడుతున్న కష్టాన్ని గుర్తించినట్టు తెలిపారు. వీరికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉపశమనం కలిగించాలని పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు విజయవంతం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి మంత్రి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలకు మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ ర్ తదితర క్రీడలు మంత్రి స్వయంగా నిర్వహించి, వీక్షించి వారితో సంతోషాన్ని పంచుకున్నారు. లక్కీ డిప్పు ద్వారా చీరలు పంపిణీ చేశారు. విలువైన బహుమతులు విజేతలకు అందజేశారు. తెల్ల పూడి గ్రామంలో మంత్రికి ఘన స్వాగతం లభించింది. మహిళలు విశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, టిడిపి మండల అధ్యక్షుడు పాముల రజని కుమార్, బోనం నాని, ఇంటి శ్రీరాముడు. స్వామి అయ్యప్ప నాయుడు, నడపన రామాంజనేయులు, జగపతి, నరసింహ స్వామి, బోడపాటి కాశీ విశ్వనాథం, నీలం తాతాజీ, ఆమె శెట్టి రంగారావు, గురుజు రాంబాబు, దిడ్ల రామాంజనేయులు, బల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.