Skip to main content

Telugu News Power

అబ్బిరాజుపాలెం రేవు పాట వాయిదా.

యలమంచిలి: జులై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అబ్బిరాజుపాలెం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం సోంపల్లి మధ్య పడవలు నడుపుకోవటానికి శనివారం జరగవలసిన రేవు పాట వాయిదా పడింది. ఈ రేవు పాట గడువు గత నెల 30తో ముగిసింది. అప్పటినుంచి పడవలు నడుపుకోవటానికి అధికారిక ఉత్తర్వులు లేవు. అనధికారికంగా రేవు నిర్వహిస్తున్నట్టుస్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.