యమంచిలి: జూలై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ సభ్యుల గౌరవ వేతనాలను విడుదల చేయించాలని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కు మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యులు వినతిపత్రం శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
తమకు 2024 నుంచి ఇంత వరకు ఎం. పి. టి. సి. ల గౌరవ వేతనాలు రావటం లేదని వాపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ఈ సమస్య ను తొందరగా పరిష్కరించమని కోరుతూ, వినతి పత్రాన్ని మంత్రివర్యులు కు సమర్పించారు. ఈ కార్యక్రమం లో ఎం. పి. పి. ఇనుకొండ ధనలక్ష్మి , వైస్-ఎం. పి. పి. లు గొల్లపల్లి శ్రీనివాసరావు, కొప్పాడి శ్రీనుబాబు, మాజీ ఎం.పీ. పి రావూరి వెంకటరమణ, ఎం. పి టి. సి. లు–శ్రీమతి. కడలి. సుబ్బలక్ష్మి, కంబాల సత్యశ్రీ , కడలి. సునీత, మానుకొండ. చిట్టెమ్మ గారు,శ్రీ. ఇసుకపల్లి. శ్రీధర్ వర్మ , కంబాల. తిరుమల వెంకటేశ్వరరావు, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు ఇనుకొండ. రవికుమార్, వైస్సార్సీపీ జిల్లా నాయకులు కడలి ఏడుకొండలు,మండల నాయకులు మానుకొండ. సోమరాజు, కడలి నరసింహారావు పాల్గొన్నారు
గౌరవ వేతనం విడుదల చేయాలి. ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు మంత్రి నిమ్మలకు వినతి.
మంత్రి నిమ్మలకు వినతి పత్రం అందజేస్తున్న మండల పరిషత్ సభ్యులు