Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ నిత్య అన్నదాన పథకానికి రూ. 1.22 లక్షల విరాళం.

అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి విరాళం అందజేసిన భక్తులు

భీమవరం: జులై,5(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణ కోసం భీమవరం యనమదుర్రు కి చెందిన తానల కృష్ణ ఉమాదేవి దంపతులు రూ.1,11,500 లు, వారి అల్లుడు, కుమార్తె పులగం లీలా వీరేంద్ర కుమార్ హరిప్రియ రూ.11,116 లు విరాళంగా అందచేసారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. వీరికి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ దాతలకు శేషవస్త్రం ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందచేసారు.