Telugu News Power

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించిన మంత్రి కందుల, ఎమ్మెల్యే పంతం.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మంత్రి కందుల
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎమ్మెల్యే నానాజీ

ముంబయి: జులై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే 19 నానాజీ విడివిడిగా మంగళవారం కోకిల బెన్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వైద్యుల సూచనలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, ప్రజాసేవ, పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై ఆయన చూపుతున్న అంకితభావం ఎంతో ప్రేరేపించిందని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించే ఆలోచిస్తూ అందించిన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని వారు ఆకర్షించారు.