Skip to main content

Telugu News Power

దిగమర్రు లో రైతుబడి కార్యక్రమం.

పొలంబడి కార్యక్రమంలో పాల్గొన్న రైతులు

పాలకొల్లు: జులై, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
పొలం పిలుస్తుంది కార్యక్రమo దిగమర్రులో మంగళవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్, కౌరు సందీప్, తమ్మినీడి చంద్రశేఖరు, మాజీ సర్పంచ్ రాపాక నగేష్ కరుణాకరన్, రైతులు పాల్గొన్నారు సహాయ సంచాలకు పి మురళీకృష్ణ మాట్లాడుతూ, పంట పొలాలకు నీటి సరఫరా సవ్యంగా జరుగుతుందని రైతులు ఎటువంటి కంగారు పడవద్దని ధైర్యం చెప్పారు. యూరియా, డిఏపి కావాల్సినంత ఎరువు మన మండలంలో అందుబాటులో ఉన్నదని ఎవరో ఇబ్బంది పడవద్దని ప్రతి రైతు కూడా ఏపీఎంసీ యాప్ ద్వారా తీసుకోవాలని తెలియజేసారు. ఏవో రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ పంట నమోదు చేసుకునే విధంగా రైతులకు తెలియజేసినారు అలాగే ప్రభుత్వ పథకాలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరి కైతే డబ్బులు పడలేదో వాళ్ళు మాకు తెలియజేస్తే వెంటనే పరిష్కరించవచ్చని తెలిపారు.