Telugu News Power

నేడు కైకలూరులో జనసేన ఆత్మీయ సమావేశం.

జనసేన ఆత్మీయ సమావేశం ఏర్పాట్ల గురించి వివరిస్తున్న కోటికిలపూడి

భీమవరం: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్)
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో, తొలి సమావేశాన్ని కైకలూరు నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.

ఈ ఆత్మీయ సమావేశం బుధవారం ఉదయం 9:30 గంటలకు కైకలూరులోని సీఎన్ ఆర్ గార్డెన్స్ లో నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, కార్యకర్తల బాధ్యతలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గంలోని జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, సాధకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కొటికలపూడి గోవిందరావు పిలుపునిచ్చారు.
ఈ పాత్రికేయుల సమావేశంలో చెన్నమల్ల చంద్రశేఖర్, వివిధ మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.