హైదరాబాద్: జులై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రముఖ నిర్మాత డాక్టర్ కె. వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఎఫ్ఎన్‌సీసీలో ఘనంగా జరిగాయి.
మెగాస్టార్ చిరంజీవి తోడల్లుడు, సక్సెస్ ఫుల్ నిర్మాత డాక్టర్ కె. వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో అత్యంత వైభవంగా జరిగాయి. మెగా ఫ్యామిలీకి ఎంతో ఆప్తులైన వేడుక కావడంతో పలువురు ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని పంచుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుడిగానే కాకుండా, చిరంజీవికి ‘రౌడీ అల్లుడు’, అల్లు అర్జున్ కు ‘రేసుగుర్రం’ వంటి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్వరరావు సినీ ప్రస్థానం ఈ తరం నిర్మాతలకు ఆదర్శనీయం. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఆత్మీయ వాతావరణంలో సాగాయి. ఫిల్మ్ నగర్ క్లబ్ మెంబర్స్ అందరి సమక్షంలో డాక్టర్ కే వెంకటేశ్వరరావు కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకున్నారు. చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉన్న ఆయనకు క్లబ్ సభ్యులు, తోటి మిత్రులు ఘనంగా సన్మానం చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్ కు అత్యంత ఆప్తుడిగా, ఇండస్ట్రీ వర్గాల్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. డాక్టర్ కే వెంకటేశ్వరరావు సినీ కెరీర్ విషయానికి వస్తే ఆయన టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చరిత్ర సృష్టించిన చిత్రాలను నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘చక్రవర్తి’ చిత్రంతో నిర్మాతగా ఆయన ప్రయాణం ఎంతో ఘనంగా మొదలైంది. ఆ తర్వాత అనేక చిత్రాలను నిర్మించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ మాస్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘రౌడీ అల్లుడు’ చిత్రాన్ని కూడా డాక్టర్ కే వెంకటేశ్వరరావు నిర్మించడం విశేషం. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ సినిమాను అల్లు అరవింద్, పంజా ప్రసాద్ లతో కలిసి ‘శ్రీ సాయిరాం ఆర్ట్స్’ బ్యానర్ పై వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. బప్పీలహరి మ్యూజిక్ అందించిన ఈ చిత్రం అప్పట్లో కలెక్షన్ల సునామీ సృష్టించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘రేసుగుర్రం’ సినిమాకు కూడా డాక్టర్ వెంకటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించి బన్నీకి మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఇలా మెగా ఫ్యామిలీ హీరోలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే.. మరోవైపు కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. నిర్మాతగా ఆయనకున్న ట్రాక్ రికార్డ్, మెగా కాంపౌండ్ లో ఆయనకున్న ప్రాముఖ్యత ఈ పుట్టినరోజు వేడుకల్లో స్పష్టంగా కనిపించింది. ఈ వేడుకల్లో మోహన్ ముళ్ళపూడి, చంటి అద్దాల, సుబ్బరాజు, ఏడిద రాజా, బోయపాటి కామేశ్వరరావు, వేణు, శ్రీనివాసరాజు, సురేష్ వర్మ, కిషోర్, శ్రీనివాస్, జర్నలిస్ట్ ప్రభు, సురేష్ కొండేటి, అమలాపురం శ్రీనివాస్, శివ, సత్యనారాయణ తదితరులు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్ కు విచ్చేసి డాక్టర్ వెంకటేశ్వరరావుకు బొకేలు అందించి విషెస్ తెలియజేశారు. ఫిల్మ్ నగర్ క్లబ్ లో జరిగిన ఈ సెలబ్రేషన్స్ లో ఇండస్ట్రీ పెద్దలందరూ ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా గడిపారు. ఈ బర్త్‌డే ఈవెంట్ లో పాల్గొని డాక్టర్ కే వెంకటేశ్వరరావుకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ బర్త్‌డే ఈవెంట్ లో కొంతమంది క్లబ్ మెంబెర్స్ పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిర్మించిన ‘రౌడీ అల్లుడు’, ‘రేసుగుర్రం’ వంటి హిట్ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు. సినిమా వాళ్లతో ఎంతో క్లోజ్ గా ఉండే డాక్టర్ వెంకటేశ్వరరావు వేడుకలు ఎఫ్‌ఎన్‌సిసి క్లబ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ గా నిలిచాయి.
ఎఫ్ఎన్‌సీసీలో ఘనంగా ప్రముఖ నిర్మాత డాక్టర్ కె. వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు.
ఆత్మీయులతో పుట్టినరోజు జరుపుకున్న నిర్మాత వెంకటేశ్వరరావు