Skip to main content

Telugu News Power

ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను ప‌రామ‌ర్శించిన మంత్రి లోకేష్.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలుసుకున్న ఐ టి మంత్రి లోకేష్

హైదరాబాద్: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంగా, రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు. హైదరాబాద్ లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ నివాసానికి శ‌నివారం సాయంత్రం వెళ్లిన లోకేష్‌ విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శ‌స్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచ‌న‌లు పాటించాల‌ని కోరారు. ఈ కలయిక పవన్ కళ్యాణ్, లోకేష్ అభిమానుల్లో ఆనందం నింపింది.