పాలకొల్లు: జూలై, 20( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పంచారామ శిరోభాగ క్షేత్ర, శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ మాడవీధుల్లో సోమవారం భక్తులు సప్త ప్రదక్షిణలలో భారీగా పాల్గొన్నారు. సప్త మారేడు దళములు, సప్త ప్రదక్షణ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఆలయ పర్యవేక్షకులు పి వాసుతో కలిసి పట్టణ ఎస్సై రజిని కుమార్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. లోక కళ్యాణార్థం, వర్షాల రాక కోసం, రాత్రి పంచ హారతులు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి వారికి ధూప సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు క్రిష్టప్ప, సూరిబాబు పూజలు నిర్వహించారు. ప్రజా హారిక కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు సహకరించారు.
క్షీరా రామం మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణలు.
క్షీరా రామంలో పంచహారతుల సేవ