పాలకొల్లు:జూలై, 20( తెలుగు పవర్ డాట్.కామ్) పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోలా రజనీకుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బివిఆర్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలకు, మహిళా ఉపాధ్యాయులకు, సిబ్బందికి మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటి నియంత్రణపై, మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సిఐ రజినీకుమార్ సదస్సులో వివరించారు. మహిళ భద్రతలో భాగంగా బాల్య వివాహాల నిషేధ చట్టం, భారతీయ న్యాయ సంహిత ( బి.ఎన్.ఎస్) చట్టాల్లో మహిళలకు కల్పించిన ప్రత్యేక సెక్షన్లను, ఫోక్సో యాక్ట్ గురించి, అత్యవసర సమయాల్లో 112 కాల్ ఆవశ్యకత, సెల్ ఫోన్లు అధికంగా వాడడంవల్ల జరిగే అనర్ధాలు, దుష్ప్రభావాలపై సీఐ రజినీకుమార్ బాలికలకు, మహిళ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యనమండ్ర ప్రభాకరశాస్త్రి, మహిళ పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రక్షణ చట్టాలపై బాలికలకు అవగాహన కార్యక్రమం.
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న రజిని కుమార్