Telugu News Power

రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణ లేదు. -స్పష్టం చేసిన ప్రభుత్వం

అమరావతి: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరిస్తున్నట్టు వైసిపి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రజలకు మరింత చేరువగా రిజిస్ట్రేషన్ శాఖ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి సేవా కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. చట్టబద్ధ అధికారాలన్నీ రిజిస్ట్రేషన్ శాఖ తన వద్ద ఉంచుకుందని స్పష్టం చేసింది. పాస్ పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందుతున్నందున, అదే తరహాలో రిజిస్ట్రేషన్ శాఖలో సేవలు అందించే ఉద్దేశంతో మాత్రమే సేవా కేంద్రాలు తీరుస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దస్తావేజుల పరిశీలన, ఆమోదం, డిజిటల్ సంతకం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్థానిక రిజిస్ట్రారే చేస్తారని వివరించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి డేటా, రిజిస్టర్లు, రిజిస్ట్రేషన్ శాఖ ఆధీనంలో ఉంటాయని స్పష్టం చేసింది.