Skip to main content

Telugu News Power

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత. -కలెక్టర్ నాగరాణి

దివ్యాంగుని సమస్య తెలుసుకుంటున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: జూలై, 20( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజల నుంచి 141 అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌లో 53 అర్జీలు స్వీకరించి, సంబంధిత శాఖలు నిర్దేశిత గడువులో నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మళ్లీ అదే సమస్యతో అర్జీలు ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె తన సమస్య పరిష్కారం కోసం వచ్చిన దివ్యాంగునితో ఆత్మీయంగా మాట్లాడి, పరిష్కారానికి హామీ ఇచ్చారు.