Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు రూ.లక్ష విరాళం

దాత ముప్పాళ్ళ దంపతులను సత్కరిస్తున్న ఆలయ అధికారులు

భీమవరం: జూలై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రనిధికి భీమవరం కి చెందిన ముప్పాళ్ళ నరసరాజు, నాగమణి దంపతులు ఒక లక్ష రూపాయలు విరాళంగా మంగళవారం అందజేశారు.ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం, ఆలయ ధర్మకర్త గుసిడి నాగ శిరీష అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజే సారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.