Telugu News Power

ఛాంబర్స్ కాలేజీ విద్యార్థి రిత్విక్ కు ప్రతిభ పురస్కారం.

ప్రతిభాపురస్కారం స్వీకరిస్తున్న రిత్విక్

పాలకొల్లు : జులై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారానికి పాలకొల్లు కేవీఎం ఛాంబర్స్ జూనియర్ కళాశాల లో
విద్యార్థి అలుగుసాని రిత్విక్ ఎంపికయ్యాడు. ఎమ్ ఈ సీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను 865 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వేంకటేశ్వరరావు పత్రికలకు వెల్లడించారు. ఈ సందర్భంగా భీమవరం రాయిలంలో, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంధ్రలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, నాగరాణి, శాసనసభ్యుల సమక్షంలో డీఈఓ చేతులమీదుగా రిత్విక్ ఈ పురస్కారం అందుకున్నాడు. ప్రశంసాపత్రం, మెడల్,
రూ. 20వేల చెక్ ను అందజేసారు. కళాశాల ఛైర్మన్ కేవీర్ నరసింహారావు,
కళాశాల సెక్రటరీ,కరస్పాండెంట్
కేవీ సీతారామరాజు, ట్రెజరర్,
ఆర్. ప్రవీణ్ భాను, అకడమిక్ అడ్వైజర్స్ డాక్టర్
మూర్తి, నందుల సీతారామారావు, వైస్ ప్రిన్సిపాల్ బి. విజయలక్ష్మి,, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు ప్రశంసించారు. ఈ నెల 22 న ప్రతిభా పురస్కారం పొందిన రిత్విక్ ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించబోతున్నట్లు ప్రకటించారు.