Telugu News Power

నేటి నుంచి సోలార్ రంగంలో ఉపాధికి శిక్షణ.

పాలకొల్లు: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)
శ్రీ ఏ.ఎస్.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు “సోలార్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్” పేరుతో 9 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది . ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటి బ్యాచ్ మే నెలలో విజయవంతంగా పూర్తి కాగా, రెండవ బ్యాచ్ ప్రారంభం కానుంది. 18 సంవత్సరాలు పైబడిన నిరుద్యోగ యువత మరియు అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఈ కార్యక్రమానికి అర్హులు.
ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నారు. సోలార్ రంగంలో వ్యాపార అవకాశాలు, స్వయం ఉపాధి మార్గాలు, ప్రాక్టికల్ శిక్షణ వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో ప్రత్యేక అవగాహన కల్పించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో కోరారు. 9059337379, 7995261319