న్యూ ఢిల్లీ: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్.కామ్) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయం మంత్రి, నరసాపురం పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బుధవారం భేటీ అయ్యారు. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్,డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తోపాటు పలువురు ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రి వర్మ వీరిని సత్కరించారు.
కేంద్ర మంత్రి తో, రాష్ట్ర మంత్రులు భేటి.
కేంద్రమంత్రి వర్మతో సమావేశమైన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు