ఏలూరు: ఆగస్టు, 7( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్, ఏలూరు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు చేయించినందుకు, ఏలూరు నగర ప్రజలు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఇటీవల ఉపముఖ్యమంత్రిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల దుస్థితిని సచిత్రంగా సెల్ ఫోన్ లో చూపించారు. అది చూసిన ఉపముఖ్యమంత్రి ఆశ్చర్యానికి లోనయ్యారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉందని విద్యార్థులను ప్రశ్నించారు. దీనిపై వెంటనే స్పందించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాలేజీ దుస్థితిని మార్చడానికి రూ. 12.60 కోట్లు మంజూరు చేయించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఉన్నత విద్యా శాఖ కమిషనర్ కు ఈ పనులు ముంచడానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఓట మి నాయక్ పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతా పూర్ వక చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
చెట్ల కింద చదువులకు చెక్ పెట్టిన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం.