Skip to main content

Telugu News Power

వైద్య విద్యార్థి ప్రియాంక మరణం బాధించింది. -ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్.

అమరావతి:ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్. కామ్)
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులు కారును నిర్లక్ష్యంగా నడిపి, ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని డా.ప్రియాంక హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ఆదివారం చెందింది. ఈ సంఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఈ దురదృష్టకర సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైద్యురాలిగా ఎంతో మందికి సేవలు అందించాల్సిన ఆమె ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డా.ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాని, నివాళులు అర్పించారు.