Skip to main content

Telugu News Power

పెద గోపురంలో, రుద్ర హోమం లీలా కళ్యాణం.

రుద్ర హోమం లో పాల్గొన్న భక్తులు.
చైర్మన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో లీలా కళ్యాణం.

పాలకొల్లు: ఆగస్టు,11( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం, మాస శివరాత్రి సందర్భంగా ఉదయం, రుద్ర హోమం పూజల్లో దంపతులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. లీలా కళ్యాణం పుణ్యదంపతులచే సాయంత్రం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న, లీలా కళ్యాణం పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప ,అర్చకులు అనీల్, వీరబాబు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఆలయ ధర్మకర్త సురేఖ, సూపర్నెంట్ వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.