Skip to main content

Telugu News Power

ప్రజల ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, అందమైన పార్కుల సృష్టి. -మంత్రి నిమ్మల

కొత్త కుళాయి చెరువు గట్టు పనులు పరిశీలిస్తున్న మంత్రి

పాలకొల్లు: ఆగస్టు,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణ ప్రజల ఆరోగ్యానికి ఆహ్వానానికి వివిధ ప్రాంతాల్లో అందంగా పార్కులను, సుందర ప్రదేశాలను తీర్చిదిద్దుతున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరులను శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం ఆరోగ్య వనం, కొత్త కుళాయి చెరువు ప్రాంతాలను బుధవారం ఓటమి నాయకులతో కలిసి పరిశీలించారు. సుందరీకరణ అభివృద్ధికి సంబంధించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు, ఏజెన్సీలకు మంత్రి సూచించారు. పట్టణ ప్రజలు పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా ఆరోగ్యం, ఆహ్లాదం ఇచ్చే వాతావరణంలో గడపటానికి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి పట్టణంలో పెద్ద ఎత్తున పార్కులు సృష్టిస్తున్నట్టు మంత్రి వివరించారు. పూర్తయితే పట్టణానికి సుందరమైన రూపురేఖలు సంతరించుకుంటాయని మంత్రి వెల్లడించారు. ఈ పర్యటనలో, కమిషనర్ డి కిరణ్ కుమార్, పలువురు అధికారులు, కూటమి నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, ఉన్నమట్ల కపర్తి, పొట్లూరి శ్రీనివాస్, జక్కంపూడి కుమార్, జగ్గరోతు రాంబాబు, మల్లంపల్లి పకీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.