
పాలకొల్లు: ఆగస్టు,13( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజల కేమీ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక ఇమిడి సత్యనారాయణ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి గురువారం స్వయంగా పరిశీలించారు. ఎందుకు సంబంధించి అధికారులు, కాంట్రాక్టర్లతో సమగ్రంగా సమీక్ష సమావేశం సుదీర్ఘంగా నిర్వహించారు. త్వరలో వేగం పెంచాలని, నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ నిధుల నుంచి రూ.1.50 కోట్లు, జలవనురల శాఖ నుంచి రూ. 80 లక్షలు, మున్సిపల్ శాఖ నుంచి రూ. 80 లక్షలు, ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 1.50 కోట్ల నిధులు, హోమియో ఆసుపత్రి భవనానికిరూ.30 లక్షల నిధులు మంజూరు చేయించినట్టు వెల్లడించారు. ఈ పనులు వేగవంతంగా జరగటం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాల్లో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా, గర్భిణీలు, బాలింతలు కోసం అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రభుత్వం సమకూర్చిన తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో, నరసాపురం ఆర్టీవో దాసిరాజు, టిడిపి నాయకులు పెచ్చెట్టి
బాబు, గండేటి వెంకటేశ్వరరావు, పొట్నూరి శ్రీనివాస్, చిన్నమిల్లి గణపతి రావు, అధికారులు పాల్గొన్నారు.