పాలకొల్లు: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద పతాకావిష్కరణ జరిగింది. జనసేన నాయకులు బోనం చినబాబు, తులా రామలింగేశ్వర రావు, బిట్టా లక్ష్మీనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద చైర్మన్ కోడి విజయభాస్కర్ పతాకావిష్కరణ చేశారు. కాస్మో క్లబ్ అధ్యక్షులు, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు, గొట్టుముక్కలుగా అంది భగవాన్ రాజు, కాస్మో క్లబ్, వృద్ధాశ్రమాలు వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కొల్లి కొండ ప్రసాద్ ఆవిష్కరణ చేశారు. వైఎస్ఆర్సిపి నాయకులు పార్టీ కార్యాలయం వద్ద, గాంధీ బొమ్మల సెంటర్లో పతాక ఆవిష్కరణ చేశారు. మున్సిపల్ కార్యాలయం, మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద అధికారుల ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించారు. స్థానిక టౌన్ వద్ద నాజీ ఎమ్మెల్సీ అంగన్ రామ్మోహన్రావు తో కలిసి, హై కోర్ట్ అడ్వకేట్ పోలిశెట్టి రాధాకృష్ణ పథకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. యూకేజీ కాపు సర్వీస్ క్లబ్ తరఫున గవర్నర్ పెనుమాక రామ్మోహనరావు పతాకావిష్కరణ చేశారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వద్ద జరిగిన స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు సంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడలా ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు.
స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో జనసేన ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ