Skip to main content

Telugu News Power

మెగాస్టార్ చిరంజీవి కి పురుడు పోసిన ఆసుపత్రిలో జన్మదిన వేడుకలు.

వైద్య సిబ్బందికి చీరలు పంచుతున్న ఎమ్మెల్యే నాయకర్

నరసాపురం,: ఆగస్టు,16( తెలుగు న్యూస్ పవర్. కామ్)మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆదివారం నరసాపురం మిస్సమ్మ ఆసుపత్రిలో మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి. మెగాస్టార్ చిరంజీవి కి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆసుపత్రిలోనే చిరంజీవి మాతృమూర్తి అంజనమ్మ మెగాస్టార్ కు జన్మనిచ్చారు.
చిరంజీవి గారి సేవా స్ఫూర్తితో అభిమానులు ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని,ఆయన జన్మించిన ఆసుపత్రిలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని నాయకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్యలక్ష్మి, పోలిశెట్టి శ్రీనివాస్, ఎం కోటేశ్వరరావు, మైలవరపు వసంతరావు, కోపల్లె శ్రీను, పోలిశెట్టి సాంబ, సిహెచ్ నాగు, ప్రభాకర్, సుబ్బారావు పాల్గొన్నారు.