Skip to main content

Telugu News Power

భారత ఆర్థిక సంస్కరణల సారథి నిర్మలా సీతారామన్‌ వారికి జన్మదిన శుభాకాంక్షలు

జాతీయస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిన నైపుణ్యాభివృద్ధి సంస్థను పరిశీలిస్తున్న ఆర్థికమంత్రి నిర్మల.
సముద్ర కోత రక్షణ గోడపై కేంద్ర,రాష్ట్ర మంత్రులు శ్రీనివాస వర్మ, రామానాయుడు చర్చిస్తున్న నిర్మల

న్యూఢిల్లీ:ఆగస్టు 17, తెలుగు న్యూస్ పవర్.కామ్) కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన 67వ జననోత్సవాన్ని
జరుపుకుంటున్నారు. వీరు 1959 ఆగస్టు 18న తమిళనాడులోని మదురైలో జన్మించారు.ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన నిర్మలా సీతారామన్ రాజకీయాల్లోకి వచ్చి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా 2014లో బాధ్యతలు చేపట్టారు. ఆమె 2017లో దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి పూర్తికాల మహిళా మంత్రి గా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.ఈమె
తొలి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి కూడా,2019 మే లో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దేశానికి తొలి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో 2019 జూలై 5న ఆమె ప్రవేశపెట్టారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక విధానాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ, పెట్టుబడులు, మౌలిక వసతులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగం వంటి అంశాలపై ప్రభుత్వం చేపట్టిన విధానాల్లో ఆమె కీలక బాధ్యతలు నిర్వహించారు.

నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా, వరుసగా 9 బడ్జెట్లు ప్రవేశపెట్టి, ఆరు బడ్జెట్లో ప్రవేశపెట్టిన మురార్జీ దేశాయ్ రికార్డును అధిగమించారు. దేశ ఆర్థిక చరిత్రలో అత్యంత ప్రత్యేక స్థానం, ప్రత్యేకమైన రికార్డును నెలకొల్పారు. తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను 2026 ఫిబ్రవరి 1న ఆమె వరుసగా ప్రవేశపెట్టారు. భారత పార్లమెంటరీ చరిత్రలో ఒకే వ్యక్తి వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టడం అనే అరుదైన ఘనత సాధించారు.
మోదీ ప్రభుత్వం 2024లో మూడోసారి ఏర్పడిన తర్వాత కూడా ఆమెకు ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల బాధ్యతలు కొనసాగిస్తన్నారు. దీంతో కీలక ఆర్థిక విధానాల రూపకల్పనలో ఆమె అనుభవం, నిర్ణయ సామర్థ్యానికి మరింత ప్రాధాన్యం లభించింది.
ఆర్థిక విధానాల్లో ఆమెది ప్రత్యేక ముద్ర.
ఆర్థిక క్రమశిక్షణ, సంస్కరణలు, పెట్టుబడుల ప్రోత్సాహం, మౌలిక వసతుల అభివృద్ధి, స్వయం సమృద్ధి లక్ష్యాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలకు నిర్మలా సీతారామన్ తన పదవీకాలంలో ప్రాధాన్యం ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, చమురు ధరల పెరుగుదల వంటి సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆమె జన్మదిన సందర్భంగా ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధిపై ఆమె చూపుతున్న దృష్టిని ప్రశంసిస్తూ,బలమైన, స్వావలంబన భారతదేశ నిర్మాణానికి ఆమె కృషి మరింత ఊతమిస్తోందని పలుసార్లు పేర్కొన్నారు.
వ్యక్తిగత జీవితానికి సంబంధించి, చూస్తే అతి సరళమైన సామాన్య జీవితం గడుపుతారు. వారి ఆహార్యం, ప్రవర్తనలో ఎక్కడా ఉన్నత విద్యావంతురాలని, దేశ ఆర్థిక మంత్రనని, ఇసుమంతైనా, బేషజం కనపడదు. పుట్టినింట తమిళ సంస్కృతి, మెట్టినింట తెలుగు సంస్కృతి, ఆ రెండిటికీ మూలం ద్రావిడ సంస్కృతి. అందువల్ల చాలా సాంస్కృతిక సంబంధం ఉంటాయి. ఆమె అత్తమామలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వారు. మామ పరకాల శేషవతారం రాష్ట్ర మంత్రిగా, అత్తయ్య ఎమ్మెల్యేగా పదవులు అలంకరించారు. ప్రధాని ఇందిర, మరో ప్రధాని పివి నరసింహారావు కు వీరు అత్యంత సన్నిహితులుగా మెలిగారు. నిర్మలకు భర్త పరకాల ప్రభాకర్, ఏఐసీసీ సభ్యులు, రాజీవ్ గాంధీ జాతీయ వాటర్ మిషన్ చైర్మన్ గుర్తింపు పొందారు. ఫ్రాన్స్ లో జరిగిన అంతర్జాతీయ రాజకీయ సమావేశాల్లో ప్రభాకర్ ఉపన్యాసాలు చాలా లోతైన విశ్లేషణతో సాగినట్టు పేరు తెచ్చుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో నర్సాపురంలో ఎమ్మెల్యేగా రెండుసార్లు విఫల ప్రయత్నం చేశారు. తనతో ఏడు అడుగులు నడిచిన నిర్మలా సీతారామన్, భర్త విజయం కోసం ఆయన వెంట నడిచారు. నిర్మల సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ప్రభాకర్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సలహాదారుగా ఉన్నారు. వారు కాంగ్రెస్ నుంచి బిజెపి మీదుగా ప్రస్తుతం వామపక్ష భావజాలంతో బిజెపి పార్టీని, నిర్మల సీతారాములు వ్యక్తిగతంగాను లక్ష్యంగా చేసుకుని, అప్పుడప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకు దీటుగా నిర్మలా సీతారామన్ విమర్శలు తృప్తి కొడుతున్నారు. మెట్టినింటిపై అభిమానంతో ఆమె నరసాపురం నియోజకవర్గ పరిధిలో మంచి చేయాలని ఉద్దేశంతో సముద్రంలో కలిసిపోతున్న పెదమైన వానిలంక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సముద్ర గర్భంలోకి వెళ్లిపోతున్న పెదమైన వానిలంక గ్రామాన్ని కాపాడటానికి కిలోమీటర్ దూరం సముద్రం నుంచి రక్షణ కూడా నిర్మి స్తున్నారు. డిలైట్ కంపెనీ సామాజిక బాధ్యత నిధుల నుంచి 13.50 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు సాధించుకు వచ్చారు. మద్రాస్ ఐఐటి ఇంజనీరింగ్ నిపుణులు ఈ గోడ డిజైన్ కు సహకరిస్తున్నారు. తీర ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఏఐ ఆధారిత ఫ్యూచర్ స్కిల్స్ హబ్ ప్రారంభించారు. ఈ భారీ భవనంలో అత్యంత నైపుణ్యం గల కోర్సులు నేర్పుతారు. సైయంట్ కార్పొరేట్ సంస్థ సామాజిక బాధ్యత నిధుల నుంచి ఈ ప్రాజెక్టుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఎవరికీ తెలియకుండా తన పని తాను చేసుకు పోతున్నది. ఇలాంటి ప్రాజెక్టుల్లో జాతీయస్థాయిలో ద్వితీయ స్థానం సంపాదించి నిర్మల సీతారామన్ ముందుచూపు సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. ఆమె ఆర్థిక శాస్త్రాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి, వివిధ వాహదారిలో పనిచేసిన అనుభవం దేశానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక సమయంలో బాధ్యతలు చేపట్టి, తొలి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించి, వరుసగా తొమ్మిది బడ్జెట్లు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు తెలుగు న్యూస్ పవర్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

గ్రామస్తులు బహుకరించిన నిర్మలా సీతారామన్ చిత్రం
అస్సామీ చేనేత చీరలో నిర్మలా సీతారామన్