పాలకొల్లు: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
పట్టణములో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఆలయ హుండీలు తెరచి లెక్కించగా,
రూ.17, 71,375 లు వచ్చినది. ఈ సొమ్ము 4 నెలల ఆదాయం. భీమవరం డివిజన్ తనిఖీదారు, పి. సత్య సాయి కుమారి పర్యవేక్షణలో హుండీలు లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ సూపరింటెండెంట్ వాసు, ఆలయ ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్, నాళము నాగ వెంకట సురేఖ, కొండ్రెడ్డి సూరిబాబు, వందరపు కుమారి, నీలాపు సింహాచలం, స్థానిక ఇండియన్ బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ క్షీరా రామ దేవస్థానం హుండీ ఆదాయం రూ.17.71 లక్షలు.
స్వామి వారి హుండీ లెక్కింపు దృశ్యం