యలమంచిలి: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఓటర్ల జాబితాపై తణిఖీలు నిర్వహిస్తున్నారు. గత నెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులు చేసుకోవటానికి ఈనెల 20 వరకు గడువు ఇచ్చారు. ఈ సందర్భంగా వాటర్ల క్రైమ్ పరిష్కారం కోసం యలమంచిలి మండల తాసిల్దార్ గ్రంధి పవన్ కుమార్ బృందం మంగళవారం లంక గ్రామమైన పెదలంకలో క్లైమూల పరిష్కారం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లు తమ సమస్యను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కారం కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాళ్ల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా మార్పులు చేర్పుల దరఖాస్తులపై తనిఖీ.
క్లయిమ్ ల పరిష్కార శిబిరంలో తాసిల్దార్ పవన్, మాజీ సర్పంచ్ నాగరాజు తదితరులు