Skip to main content

Telugu News Power

అంతర్వేది లో రూ.2.80 కోట్ల అభివృద్ధి పనులు పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు.

అంతర్వేది ఆలయాన్ని పరిశీలిస్తున్న ఇంజనీర్లు

అంతర్వేది: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్వేది
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న పనులను, దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులు మంగళవారం పరిశీలించారు. పర్యవేక్షక ఇంజినీర్ దుర్గేష్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సాంకేతిక లోప సలహాదారులు ఎస్ సుబ్బారావు ఆలయాన్ని, నూతన అన్నదాన భవనాన్ని, రథం షెడ్డు ను పరిశీలించారు. దాతలు రూ. 2.80 కోట్లతో నిర్మించే అన్నదాన భవనానికి చేయవలసిన చేర్పులు, మార్పులు సూచించారు.. క్షేత్ర సంరక్షకుడు శ్రీఆంజనేయ స్వామి నూతన ఆలయం నిర్మాణం కొరకు స్థలం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఉదయ్ కుమార్, పరివేక్షకులు పి విజయ సారధి, కిరణ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.