Skip to main content

Telugu News Power

తూర్పు కాపులను ఓబీసీ ఓబీసీలుగా కేంద్రం గుర్తించాలి. లోకేష్ కు నాయకుల వినతి.

అమరావతి/ పాలకొల్లు: ఆగస్టు,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) తూర్పు కాపు అందరిని ఓబీసీలుగా కేంద్రం గుర్తించాలని కోరుతూ, రాష్ట్ర జలవలుల శాఖ మాత్యులు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు,బీసీ సంక్షేమ శాఖామాత్యులు, కొనగల శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు గురువారం, అమరావతిలో కలసి వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలలో ఉన్న తూర్పు కాపులను మాత్రమే కేంద్రం ఓబీసీలుగా గుర్తించిందన్నారు. అయితే, రాష్ట్రంలో తూర్పు కాపులు ఎక్కడ ఉన్న ఓబిసిలుగా గుర్తించాలని సుదీర్ఘకాలంగా సంఘ నాయకులు పోరాటం చేస్తున్నారు. సంఘ నాయకులు చెప్పిన విషయాలను మంత్రి లోకేష్ శ్రద్ధగా విన్నారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలించి, వారి డిమాండ్ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు నాయకులు పత్రికలకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పాలవలస యశస్వి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, స్థానిక నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, మీసాల రామచంద్ర రావు, పాలవలస తులసి రావు, పొట్నూరి శ్రీనివాస్, శీడగం సతీష్,యలకల రంగారావు,శంకరాపు శ్రీనివాస్, తదితరులు ఈ బృందంలో ఉన్నారు.