Skip to main content

Telugu News Power

సూర్యాపేట ఎన్టీఆర్ బీచ్ లో నలుగురు గల్లంతు ఇద్దరు మృతి.

ఒడ్డుకు చేర్చిన మృతదేహాలు

కాకినాడ రూరల్: ఆగస్టు,24( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక సూర్యరావుపేట, ఎన్టీఆర్ బీచ్ వద్ద అలల ఉద్ధృతి కారణంగా ప్రమాదవశాత్తు నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరి లో ఇద్దరు మరణించారు. ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనల మేరకు పంతం సందీప్ గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలు, మెరైన్ పోలీస్ బృందాలు, స్థానిక జనసేన పార్టీ మత్స్యకార నాయకులతో కలిసి గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతై వారిలో లభ్యమైన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆదివారం గల్లంతైన నలుగురిలో సముద్రం నుండి సురక్షితంగా రక్షించి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జి జి హెచ్) లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధిత కుటుంబాలను పరామర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
అనంతరం పంతం సందీప్ మృతుల కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించి ఎమ్మెల్యే పంతం నానాజీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.కూటమి ప్రభుత్వం అన్ని విధాలా బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.