మచిలీపట్నం:ఆగస్టు,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
మంగినపూడి బీచ్ వద్ద అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్న 63 అడుగుల సాగరతీర మహాగణపతి విగ్రహ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సంకల్పంతో దేశం నలుమూలల నుంచి పవిత్ర మట్టి సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
మచిలీపట్నం ప్రజలు తమ ఇళ్ల నుంచి, వ్యవసాయ క్షేత్రాల నుంచి సేకరించిన మట్టిని తీసుకుని భారీ శోభాయాత్రగా తరలివచ్చి కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు.
ఈ మహత్తర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, కమిటీ సభ్యులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్న మచిలీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, కృష్ణాజిల్లా డీసీఎంఏస్ చైర్మన్ బండి రామకృష్ణ, భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ప్రతి ఇంటి మట్టి. ప్రతి రైతు మట్టి. ప్రతి మచిలీపట్నం పౌరుడి భాగస్వామ్యం.
ఇదే మన మహాగణపతి నిర్మాణానికి ప్రజా సంకల్పం చేపట్టారు.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మచిలీపట్నం మరింత అభివృద్ధి చెందాలని ఈ మహా గణనాథుని ప్రతిష్టిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
దేశం నలుమూలల నుంచి తెచ్చిన మట్టితో మచిలీపట్నంలో మహాగణపతి.
మహాగణపతి విగ్రహానికి మట్టి సేకరణ వెళుతున్న కమిటీ సభ్యులు