Skip to main content

Telugu News Power

చండీ హోమం, పారాయణం మహత్కార్యంలో భక్తులు విరి@విగా పాల్గొనాలి. -దేవస్థానం అధికారుల పిలుపు

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు, భీమవరం

భీమవరం: ఆగస్టు, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసిఉన్న
శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి శుక్రవారం సందర్భంగా, ఈ నెల 28న ఉదయం 8 గంటలకు
లోకక్షేమం,సర్వజన సౌభాగ్య,శాంతి, సంపదల కోసం లోకహితం, సర్వజన శ్రేయస్సు, ప్రజల సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం విశేషంగా చండీ హోమం నిర్వహించనున్నట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
శ్రావణ పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతున్న నేపథ్యంలో, జగన్మాత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో వేదమంత్రోచ్ఛారణలు, చండీ పారాయణం, హోమ కార్యక్రమాలతో భక్తిశ్రద్ధలతో ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
అమ్మవారి అనుగ్రహంతో సమాజంలో శాంతి, కుటుంబాల్లో సౌఖ్యం, ప్రజల్లో ఆరోగ్యం, రైతులకు సమృద్ధి, వ్యాపారులకు అభివృద్ధి, సర్వజనులకు సుఖసంతోషాలు కలగాలని సంకల్పంతో ఈ చండీ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చండీ హోమంలో అమ్మవారి ఆరాధన, నవావరణ పూజలు, చండీ పారాయణం, హోమకార్యక్రమాలు, పూర్ణాహుతి తదితర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
“అమ్మవారి సన్నిధిలో ఒక్కసారి భక్తితో చేసే ప్రార్థన కూడా మనసుకు ప్రశాంతతను, జీవితానికి ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తుంది” అనే విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చండీ హోమాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. శ్రావణమాస పౌర్ణమి పండగ నేపథ్యంలో.. ప్రత్యేకంగా అష్టాదశ భుజ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉత్సవమూర్తిని దేవస్థానం ఉత్సవ మండపం లో ఏర్పాటు కు సిద్ధం చేస్తున్నామని దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ తెలిపారు.
శ్రావణ పౌర్ణమి పవిత్ర పర్వదినాన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో జరిగే ఈ చండీ హోమంలో ప్రతి భక్త కుటుంబం భాగస్వాములై, అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని దేవస్థానం తరఫున ఆకాంక్షించారు.
లోకక్షేమం కోసం చండీ హోమం – సర్వజన సౌభాగ్యం కోసం అమ్మవారి అనుగ్రహం”
భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు విజ్ఞప్తి చేశారు