Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ వారి హుండీ ఆదాయం రూ.74 లక్షలు.

అమ్మవారి హుండీ లెక్కింపు దృశ్యం

భీమవరం: ఆగస్టు, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం,ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం హుండీలు గురువారం తెరచారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం జరిగింది.
హుండీల ద్వారా 79 రోజుల కాలానికి రూ 73,81,359 లు భక్తులు హుండీ లో సమర్పించుకున్నారు బంగారం 23.150 గ్రాములు, వెండీ 360 గ్రాములు శ్రీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాకినాడ ఎం ఎస్ ఎన్ చారిటీస్,, అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. ఆలయ
ప్రధానార్చకులు
బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ,, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు,రామాయణం శ్రీనివాస్, ఉదీశి మీనాక్షి, అతికెలఆంజనేయ ప్రసాద్, కారెంపూడి ఆదిలక్ష్మి మిర్తిపాటి గున్నేశ్వరరావు పాపోలు ఏడుకొండలు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, భీమవరం బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది,
ఆలయ సిబ్బంది పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.