
పాలకొల్లు: ఆగస్టు,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) అక్టోబర్, 25న పాలకొల్లులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 10కే పరుగు కార్యక్రమం విజయవంతం చేయాలని, స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కలు గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు, స్థానిక కాస్మో క్లబ్ కళావేదిక పై “టెన్ కే రన్” గోడ పత్రిక శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, గాంధీ రాజు మాట్లాడుతూ, విశాఖపట్నం వంటి మహానగరాలకు మాత్రమే పరిమితమైన ఇలాంటి కార్యక్రమాలు పాలకొల్లుకు తీసుకురావడం అన్నారు. ఈ సందర్భంగా పాలకొల్లు రన్నర్స్ క్లబ్ వారిని అభినందించారు. ప్రస్తుత ఉరకల పరుగుల జీవితంలో, ఆరోగ్యం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ, నడక పురుగు లాంటి వ్యాయామాలు తప్పక చేయాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడానికి ఈ భారీ కార్యక్రమం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి, సీట్ కూడా అందుబాటులోకి తీసుకు వస్తామని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో, డాక్టర్ వర్మ, చెరుకూరి సూరిబాబు, సంధ్య మెరైన్స్, ఏవో, యతి రాజు రామలింగ రాజు, కోటి రామచంద్ర రాజు, చిన వర్మ, డాక్టర్ పవన్ సీతారామరాజు, వెంకటేశ్వర వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమా నికి సౌజన్యం అందిస్తున్న సంధ్య మెరయిన్స్, తదితర సంస్థలకు గాంధీ భగవాన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.