Skip to main content

Telugu News Power

క్షీరారామంలో ఏర్పాటుచేసే కార్యక్రమాల గురించి ముందుగా తెలపండి. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాము, భక్తులకు విజ్ఞప్తి.

పాలకొల్లు: ఆగస్టు, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరపబోయే కార్యక్రమాల గురించి ముందుగా తెలియజేయాలని, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక లీలా కళ్యాణ మండపంలో శుక్రవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవస్థానంలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాలకు సంబంధించి అప్పటికప్పుడు అనుమతి కోరుచున్నందువల్ల ఏర్పాటు చేయడం ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు, స్వచ్ఛంద సంస్థలు, సేవకులు వారు చేయబోయే వివిధ కార్యక్రమాల గురించి దేవస్థానం వారికి ముందుగా తెలియజేయాలని కోరారు. తమ వల్ల తెలియక జరిగిన పొరపాట్లను మన్నించాలని కోరారు. తాము బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి భక్తుల సౌకర్యార్థం సేవా భావంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇటీవల జలాభిషేకం కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి గవర సురేష్ టెండర్లలో పాల్గొన్నారని తెలిపారు. లాభాపేక్ష లేకుండా భక్తితో తల్లి గారి పేర నిర్మించి ఇవ్వటానికి ముందుకు వచ్చారని వెల్లడించారు. అన్నదాన శాశ్వత భవనానికి కోటి రూపాయల నిధులతో భవన నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఎందుకు సింగిల్ టెండర్ మాత్రమే వచ్చింది అన్నారు. భక్తుల సౌకర్యార్థం పోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని డార్మెటరీ, క్లోక్ రూమ్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముచ్చర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, సిబ్బంది తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తాత్కాలికంగా చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి దేవస్థానం వినియోగం కావడంలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాలయ పరివేక్షకులు పి వాసు, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్, బసవ సత్యనారాయణ, ఉప్పులపు పెద్దిరాజు, మాజీ ఎంపీపీ పెనుమత్స శ్రీదేవి, పలువురు ధర్మకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.