అరకు: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న సంజీవని ఆరోగ్య కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పాల్గొన్నారు. ఇంటి వద్దకే వైద్య సేవలు అందేలా రూపొందించిన సంజీవని కార్యక్రమంపై అరకులో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించే ఆరోగ్య రథాలను ప్రారంభించారు. అత్యాధునిక 21 ఆరోగ్య రథాల సేవలను ప్రారంభించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాహనాలను అందుబాటులోకి తెస్తాము. వీటి ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవల్లో మరో ముందడుగు పడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమాత్యులు సత్య కుమార్ యాదవ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఆరోగ్య రధాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజల వద్దకే వైద్యం.
సంజీవని ఆరోగ్య రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు