యలమంచిలి: ఆగస్టు,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
బూరుగుపల్లిలోపెనుగొండ సీతారామయ్య – సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పెనుగొండ సూర్యనారాయణ, నాగ తులసి దంపతులు సౌజన్యంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాలకొల్లు సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది.ఈ ఉచిత కంటి, చర్మ వ్యాధుల వైద్య శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ గనిశెట్టి వెంకటకృష్ణ, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ పెనుగొండ రజితలు వైద్య సేవలు అందించారు. కంటి సమస్యలు, చర్మ వ్యాధులకు సంబంధించి 40 మందికి ఉచితంగా చికిత్స అందించారు. ఈ సందర్భంగా, సూర్యనారాయణ కుటుంబ సభ్యులు వృద్ధులకు ఉచితంగా చీరలు, పంచెలు, బియ్యం పంపిణీ చేశారు. సూర్యనారాయణ కుటుంబ సభ్యులు, శిరిగినీడి సత్యనారాయణ, సంగీత, కోటిపల్లి మణికంఠ, సాయిహరిత, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు యర్రంశెట్టి వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి జి.ఎస్.ఎన్. మూర్తి, ప్రతినిధులు యర్రమిల్లి నరసింహారావు (వై ఎన్ ఆర్ ) కలిదిండి వెంకటపతి వర్మ, సలాది సత్యనారాయణ మూర్తి, దేవరపు మల్లేశ్వరరావు, జడ్డు బదరీ నారాయణ, మంచెం రమేష్, చెరుకూరి మావుళ్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బూరుగుపల్లి లో పెనుగొండవారి కుటుంబ సభ్యులచే ఉచిత వైద్య శిబిరం.
పేదలకు వస్త్ర దానం చేస్తున్న దృశ్యం