పాలకొల్లు:సెప్టెంబర్,3(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక ఛాంబర్స్ కళాశాల ప్రాంగణంలో గురువారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన దేశం గొప్ప సాంస్కృతిక మరియు సర్వమత సామరస్యత కలిగిన దేశంగా ప్రపంచ దేశాల మన్నలు పొందుతుందని, దీనిని పరిరక్షించుకొనుటకు విద్యార్థి దశలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అవసరమన్నారు.
కళాశాల సెక్రెటరీ కేవీ సీతారామరాజు మాట్లాడుతూ, ఆనందంగా ఆహ్లాదకరంగా సంతోషంగా జీవనాన్ని గడపడమే కృష్ణ తత్వం అని ఈ సందర్భంగా ఉట్టి కొట్టి విద్యార్థులకు శుభాభినందనలు తెలిపినారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరావు గారు మాట్లాడుతూ విద్యార్థి దశలో దేశ ఐక్యమత్యమును ఇనుమడింపజేసే అంశాలలో విద్యార్థులు పాల్గొనుట ద్వారా విషయ అవగాహన పెరిగి సర్వమత సమ్మేళనం జరుగుతుందని, తమ కళాశాలలో సంక్రాంతి, క్రిస్మస్ లాంటి ప్రముఖ పండుగలు విద్యార్థులు నిర్వహించుకొనుట ద్వారా దేశ ఐక్యత విద్యార్థులు అలవర్చుకుంటూ మంచి పౌరులుగా తయారవుదురని, ఈ అవకాశం యాజమాన్యం కల్పించడం విద్యార్థులకు ఆనందదాయకమని అన్నారు.
విద్యార్థిని విద్యార్థులు ఆనందంగా కేరింతలు కొడుతూ, ఉట్టి కొట్టి ప్రధమ, ద్వితీయ,తృతీయ బహుమతులు కైవసం చేసుకున్నారు
ఈ కార్యక్రమానికి కళాశాల అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఏబిఎస్ మూర్తి గారు, ఎన్. సీతారామరావు గారు , కళాశాల ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కెవి నరసింహారావు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఛాంబర్స్ విద్యాసంస్థలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు.
ఉట్టి కొడుతున్న దృశ్యం