
పాలకొల్లు: సెప్టెంబర్, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పాలకొల్లు నియోజకవర్గ స్థానిక సంస్థల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులు తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకొల్లు పట్టణ జనసేన అధ్యక్షుడు శిడగం సురేంద్ర అధ్యక్షతన వార్డుల ఇంచార్జ్ లు , ముఖ్య నాయకుల సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిలుగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల నిర్వహణ సమన్వయ కమిటీ కోఆర్డినేటర్స్, డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న), చెనమల్ల చంద్రశేఖర్, గవర లక్ష్మి, జనసేన జిల్లా కార్యదర్శి బోనం చినబాబు హాజరయ్యారు . ఈ సమావేశంలో జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ విధంగా ఎన్నికలకు వెళ్లాలి, కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే పలు అంశాలపై చర్చించారు. పట్టణ జనసేన వార్డుల ఇంచార్జ్ లు తమ తమ అభిప్రాయాలని, సమాచారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శిలు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, షేక్ అబ్దుల్ మీరావలి,వార్డు ఇన్చార్జిలు పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు