
పాలకొల్లు: సెప్టెంబర్, 21
(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తన క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వివిధ ఆరోగ్య సమస్యలపై చికిత్స పొందిన, పేద, మధ్యతరగతి వర్గాల వారు 129 మందికి రూ. 64.65 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో రూ. 17.5 9 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, అంగర రామ మోహన్ రావు, ఉన్నమట్ల కాపర్తి, గండేటి వెంకటేశ్వరరావు, బోనం చినబాబు, పెనుమత్స రామభద్రరాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ,పాలవలస తులసి రావు, ఏ ఎం సి డైరెక్టర్ దాసరి రత్నం రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.