Skip to main content

Telugu News Power

శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ కళాశాలలో ఘనంగా గురజాడ జయంతి.

గురజాడకు నివాళులు అర్పిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు.

పాలకొల్లు:సెప్టెంబర్,21
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురజాడ వెంకట అప్పారావు జయంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తెలుగు విభాగం ఆధ్వర్యంలో మహాకవి, ఆధునిక తెలుగు కవిత్వ యుగకర్త,గురజాడ జయంతి వేడుకలను కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా కె రత్న మాణిక్యం ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.ఈ కార్యక్రమానికి, తెలుగు విభాగాధిపతి డా బూసి వెంకటస్వామి అధ్యక్షత వహించారు. తెలుగు అధ్యాపకులు రగుతు షణ్ముఖరావు సభ నిర్వహించారు. మహాకవి గురజాడ చిత్రపటానికి ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి డా కె రత్న మాణిక్యం మాట్లాడుతూ, గురజాడ వెంకట అప్పారావు కేవలం కవి మాత్రమే కాదు, సమాజంలోని మూఢనమ్మకాలను, సాంఘిక దురాచారాలను ఎండగట్టిన గొప్ప సంస్కరణ దృక్పథం కలిగిన యుగపురుషుడని కొనియాడారు. ఆయన రచనలు నాటికీ, నేటికీ సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు.అనంతరం సభాధ్యక్షులు డా బూసి వెంకటస్వామి మాట్లాడుతూ, గురజాడ వారి విప్లవాత్మక సాహిత్య దృక్పథం తెలుగు సాహిత్య దిశను మార్చివేసిందని, గ్రాంథిక భాషా దాస్యం నుండి సామాన్యుడిని విముక్తం చేయడానికి ఆయన సాగించిన భాషా ఉద్యమ దృక్పథం చిరస్మరణీయమని కీర్తిచారు . గురజాడ రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం, ‘దేశమును ప్రేమించుమన్నా’ గేయం తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని, విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ, అకడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత, అధ్యాపకులు జి షమీం, జి డి శ్రీనివాసరావు, పార్థసారథి, హెప్సిబారాణి, ఎం శిరీష, మాధురి, ఎల్ ఎం డి. శిరీష, రోహిత్ కుమార్ మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.